Logo

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ప్రతిభ

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్ : నుమాయిష్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చేపట్టిన ప్రయోగాత్మక ప్రదర్శనలు ఆహూతులను అకర్షించాయి. ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ల్యాబ్ టు లాండ్ పేరిట ఓయూ విద్యార్థులు హైదారాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ నెల 11, 12 తేదీల్లో విద్యార్థులు చేసిన సైన్స్ ప్రయోగాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో సహా ఆయా విభాగాల అధ్యాపకులు కూడా ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు. సీపీఎంబీ సంచాలకులు డాక్టర్ రామకృష్ణ కంచ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ డి.శశికళ, పోరెన్సిక్ సైన్స్ విభాగం నుంచి డాక్టర్ సౌమ్య, మైక్రోబయాలజీ అధ్యాపకురాలు డాక్టర్ హమీదా బీ, జెనెటిక్స్ నుంచి డాక్టర్ సంధ్య అన్నమనేని, సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అనుపమ అనపర్తి, కెమికల్ ఇంజినీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ సదాం ఐలయ్య, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి పరిశోధనలను సామన్య భాషలో ప్రదర్శించారు.

కార్యక్రమాన్ని సందర్శించిన ఓయూ యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ మల్లేశం విద్యార్థులు, అధ్యాపకుల ప్రదర్శనను అభినందించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని ప్రజలకు చేరువ చేయటంలో ఓయూ విద్యార్థులు, అధ్యాపకుల కృషిని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking