సినీహీరో నందమూరి తారకరత్నకన్నుమూత
బెంగుళూర్ : సినీ హీరో తారకరత్న (40) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. 23 రోజుల క్రితం లోకేష్ పాదయాత్రలో సృహ లేకుండా పడి పోయిన తారకరత్నను చికిత్స కోసం బెంగుళూర్ కు తరలించారు.
అయితే.. తారక రత్నకు చికిత్స కోసం విదేశీయ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్న విషయం విధితమే. అయినప్పటికీ తారకరత్న ఆరోగ్యం మరింతా విషమంగా మారింది. తారకరత్నను బతికించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. బెంగుళూర్ లోని హాస్పిటల్ లో శనివారం తుది శ్వాషవదిలారు.
తారక రత్న ఆరోగ్యం గురించి బాబాయ్ బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ తారక రత్న మరణించడంతో అభిమానులు తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేస్తున్నారు.