తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ అర్జునుడికి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆదివారం తెల్లవారుజామున గుండుపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు పరీక్షల అనంతరం స్టెంట్ వేశారు.
అర్జునుడికి బీపీ ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. అర్జునుడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బచ్చుల ఆరోగ్యంపై ఆరా తీశారు.
వైద్యులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు రమేశ్ ఆసుపత్రికి చేరుకున్నారు.