Logo

దేశంలో ఉగ్రవాదం తగ్గింది : మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో ఉగ్రవాదం తగ్గింది : మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, మే 25 :  సికింద్రాబాద్  కంటోన్మెంట్లోని క్లాసిక్ గార్డెన్లో భాజపా మహంకాళి  హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మర్రి శశిధర్ రెడ్డి భాజపా మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ తదితరులు హజరయ్యారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో భాజపా పై విష ప్రచారం జరుగుతుంది.

అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 40 సంవత్సరాలుగా ఇప్పటి వరకు అంతర్జాతీయ సదస్సు జరగలేదు.. జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ సదస్సు జరిపిన ఘనత ప్రధాని మోడీ కి చెందింది. శ్రీ నగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురవేసిన ఘనత మోడీ దే. జీ  20 దేశాల ప్రతినిధులు భాగస్వామ్యంతో జమ్మూ లో స్వేచ్చగా తిరిగే పరిస్థితి రావడానికి మోడీ పాలన కారణంమని అన్నారు.

లస్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు జి20 దేశాల సదస్సును వ్యతిరేకించినప్పటికీ విజయవంతంగా మోడీ నిర్వహించారు.దేశంలో ఐ.ఎస్ ఐ ఏజెంట్ల భయం లేదు..మత కల్లోలాలు,బాంబు దాడులు ఆగిపోయాయి..హైదరాబాద్ లో ఉగ్రవాదుల అలజడి లేదు. గతంలో భారత దేశాన్ని శాంతి భద్రతల విషయంలో పాకిస్థాన్ శాసించింది. కేంద్రంలో భాజాపా ప్రభుత్వం వచ్చిన అనంతరం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట పడింది. కర్ణాటక రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో జరిగిన రాజ్యాంతం చూస్తేనే కాంగ్రెస్ పరిస్థితి అర్థమవుతుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking