వికారాబాద్ జిల్లా : నవాబ్ పేట మండల పరిధిలోని అంతంపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల నర్సింహులును చంపిన నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.
గత కొద్దిరోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఎడ్ల నర్సింహులు మృతి పై అతని అల్లుడు యన్మంగండ్ల గ్రామానికి చెందిన కొన్నింటి బాలయ్య నవాబ్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు.
వారిని పెరిగి కోర్టు లో హాజరు పరిచి రిమాండ్ చేస్తామని సీఐ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎంతటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.