ఎగువ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణం తో రాయలసీమకు తీవ్ర అన్యాయం
సీమకు అన్యాయం జరుగుతున్నా స్పందించని ప్రభుత్వం
అఖిలపక్ష నేతల మండిపాటు
కడప : తుంగభద్ర డ్యామ్ పై భాగంలో ఎగువభద్ర ప్రాజెక్టు నిర్మాణానికి బిజెపి ప్రభుత్వం 5,300 కోట్ల నిధులను విడుదల చేసి రాయలసీమ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని కడప జిల్లా అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారము కడప ప్రెస్క్లబ్లో ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణం- రాయలసీమ నీటి సమస్యలు అంశం పైన ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎంవి సుబ్బారెడ్డి అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది… ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వర్ రెడ్డి ,సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మది ఈశ్వరయ్య, లోక్సత్తా పార్టీ నాయకులు కృష్ణయ్య, బిఎస్పి పార్టీ నాయకులు గుర్రప్ప ,కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తార్ లు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఎగువ భద్ర ప్రాజెక్టుకు 5300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని… పై భాగంలో ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల దిగువ ప్రాంతంలో ఉన్న రాయలసీమ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు..