Logo

ఈటెల స్వభావం కమ్యూనిస్టు సిద్ధాంతం

ఈటెల స్వభావం కమ్యూనిస్టు సిద్ధాంతం అనుకూలంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి. ఈటెల బీజేపీ లో ఇబ్బందిగా ఉన్నట్టు కనిపించిందన్నారు ఆయన.

బీజేపీ లో ఊపిరి పిలుచుకునే పరిస్థితి లో లేరని… బీజేపీ బీఆర్ ఎస్ రెండు ఒక్కటేనన్నారు ఆయన.

కేంద్రం నుండి వచ్చిన పంచాయతి నిధులు దారి మళ్ళితే బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు కొదండరెడ్డి.

హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఫైర్ ఆక్సిడెంట్లు పెరిగిపోతున్నాయన్నారు ఆయన.

ఆస్తి నష్టం తో పాటు ప్రాణం నష్టం జరుగుతుందన్నారు రెడ్డి.

హెచ్ఎండిఏ తో పాటు ఫైర్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు.

ఆధునాతన యంత్రాలు పరికరాలు ఉపయోగించుకోవడంలో తెలంగాణ సర్కారు విఫలమైందన్నారు కొదండరెడ్డి.

పురాతన పద్ధతులతో అగ్ని ప్రమాదాలను నివారించలేకపోతున్నారన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking