Logo

తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే

తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే
సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

జగిత్యాాల్ జిల్లా  కోరుట్ల : వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు. గురువారం కోరుట్ల పట్టణములో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కౌన్సెలింగ్ కేంద్రం లో  కోరుట్ల,మెట్ పల్లి డివిజన్ల  సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులకు వయోవృద్ధుల సంరక్షణ చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో కోరుట్ల కు చెందిన ప్రముఖ రక్త దాత కటకం గణేష్ ను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  సీనియర్ సిటీజన్స్  అవగాహన పుస్తకాలు ఆవిష్కరించారు. అనంతరం   హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ  వయోవృద్ధుల సంరక్షణ చట్టం సెక్షన్ 24 ప్రకారం వయోవృద్దులైన తల్లిదండ్రులను వేధింపులకు,నిరాదరణకు గురిచేసిన కొడుకులకు,వారసులకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అధికారం ట్రిబ్యునల్ చైర్మన్లు అయిన రెవెన్యూ డివిజనల్ అధికారులకు ఉందన్నారు.కోరుట్ల,మెట్ పల్లి డివిజన్ లలో  ఆర్డీవో వినోద్ కుమార్ వయోవృద్ధుల కేసుల పరిష్కారం లో రాష్ట్రంలోనే  నెంబర్ వన్ అధికారిగా నిలిచారన్నారు.

జిల్లా కేంద్రంలోసీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరగా త్వరలోనే ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా  హామీ ఇచ్చారన్నారు.కోరుట్ల డివిజన్ లో ప్రభుత్వం నియమించిన రాజీ అధికారులు పబ్బా శివానందం,గంటేది రాజ్ మోహన్,నల్ల లక్ష్మీ నారాయణ లు వయోవృద్ధుల కేసుల  రాజీ లో చేస్తున్న కౌన్సిలింగ్ ల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ చేతుల మీదుగా ఇటీవల జరిగిన రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆవిర్భావ సదస్సులో ఉత్తమ రాజీ అధికారులుగా అవార్డులు పొందడం ను అభినందించారు.

కేంద్రంలో ప్రభుత్వం తరపున వృద్దాశ్రమ ఏర్పాటు కు  మం కృషి  చేసిన కోరుట్ల ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు,కోటి నిధులు మంజూరు చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వయోవృద్ధుల చట్టం లో చేసిన సవరణలు  సీనియర్ సిటిజన్స్ కు భరోసా నిస్తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో  సీనియర్ సిటిజన్స్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,సీనియర్ సిటిజన్స్ కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు   పబ్బా శివానందం,కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్,కోశాధికారి నల్ల లక్ష్మీనారాయణ,ఉపాద్యాక్షుడు   ఎం.డి.సైఫోద్దిన్,మెట్ పల్లి అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్,  రాజయ్య,సాజిద్ అలీ,గంగారాం,అనసూయ,లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking