రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ములుగు : ములుగు జిల్లా రామప్పలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేవంత్ మాట్లాడుతూ దేశ భద్రత ఆందోళనకరంగా ఉంది, చైనా 2 వేల కి.మీ చొచ్చుకు వచ్చినా ప్రధాని ఏమి చేయలేదు. ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఆర్ధిక వ్యవస్థను పట్టించుకోవట్లేదు. రాహూల్ జోదో యాత్ర తో ప్రజల్లో ఆత్మస్థైర్యం కల్పించాడని అన్నారు.
తెలంగాణను ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ చిన్నాభిన్నం చేస్తున్నారు. కోతుల గుంపుకు రాష్ట్రాన్ని అప్పగించినట్లు అయిందని మండిపడ్డారు. మార్పు కోసం యాత్ర మొదలుపెట్టా. ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని మేసిఫెస్టో విడుదల చేస్తాం. బుధవారం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. గిరిజన సోదరులు యాత్రను విజయవంతం చేయాలి. పాదయాత్ర కు సంఘీబావం తెలిపిన కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలని అన్నారు.
8 శతాబ్దాల నాటి రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినా… రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. తెలంగాణ వారసత్వ సంపదని కాలగర్భంలో కలపాలని కేసిఆర్ కుట్ర చేస్తున్నారు. అత్యంత విలువైన కళా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదు. ఆర్కియాలజీ శాఖ నామమాత్రంగా మారింది.
కేసిఆర్ వాస్తు పిచ్చికి కళాఖండాలు నాశనమవుతున్నాయి. ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేస్తామని అన్నారు..
========================