టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారి పాయింట్స్..
సమస్యలు పక్కన బెట్టి మోదీ ఎన్నికల ప్రణాళికలో మునిగి తెలుతున్నారన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. రామప్ప నుంచి ములుగు వరకు పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి రేపు మహబూబాబాద్, తరువాత డోర్నకల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా మోదీ పట్టించుకోవడంలేదని విమర్శించారు ఆయన.
ప్రజల ఆకాంక్షలను కాలరాసి రాష్ర్టాన్ని కేసీఆర్ చిన్నాభిన్నం చేశారన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సమూల మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాల్సిందే అన్నారు ఆయన. అందుకే పాదయాత్ర చేస్తూ ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు రెడ్డి.
రాబోయే ఎన్నికలలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించేందుకు ఈ ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు వివరించారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో సమస్యల తీవ్రత పట్టించుకోకుండా కేసీఆర్ ఆస్తులు కూడబెట్టారు.ప్రజల సొమ్ముతో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డారు.