నక్సల్స్ కాల్పులలో ఇద్దరు పోలీసులు మృతి
చత్తీస్ గడ్ : నక్సల్స్ – పోలీసులు వీరిద్దరి మధ్య ఎప్పుడు కాల్పులు జరుగుతునే ఉన్నాయి. విప్లవం కోసం నక్సల్స్ .. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోలీసులు ఇద్దరి మధ్య జరిగే కాల్పులలో పేదోళ్లే మరణిస్తారు. ఆ విప్లవం వస్తుందో లేదో కాని ప్రతి రోజు చత్తీస్ గడ్ రాష్ట్రంలో హింస తగ్గడం లేదు. ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావులో నక్సల్స్ కాల్పులలో ఇద్దరు పోలీసులు మరణించారు. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కొల్పొయారు. బోర్తలాబ్ పీఎస్ దగ్గర్లో జవాన్లపై దాడి చేసిన మావోయిస్టులు. మృతులు హెడ్‌కానిస్టేబుల్ రాజేష్, కానిస్టేబుల్ లలిత్‌గా గుర్తించారు అధికారులు.