కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు సస్పెండ్
: డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్
నల్లగొండ జిల్లా : మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశిడి శేఖర్ రెడ్డి, దామరచర్ల మండలం దిల్వాపూర్ ఎంపీటీసీ బెజ్జం సాయి లను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు.
ఈనెల 6న మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేసి పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించినందున పార్టీ ఆదేశాల మేరకు వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించిన,పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.