భర్త మరణం తట్టుకోలేక మనస్థాపంతో గృహిణి ఆత్మహత్య
హైదరాబాద్, మే 25 : అంబర్పేట డిడి కాలనీకి చెందిన సాహితి(29) భర్త మనోజ్ యూఎస్ఏ లో హార్ట్ ఎటాక్ తో చనిపోవడంతో మనోవేదనతో సాహితీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడింది. సాహితికి సంవత్సరం క్రితమే వనస్థలిపురం కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోజ్ తో వివాహం కాగా అప్పటి నుండి వారిద్దరూ అమెరికాలోని డల్లాస్ లో నివసించేవారు.
ఈనెల రెండున సాహితీ తన తల్లిదండ్రులను చూడ్డానికి ఇండియాకు రాగా 20వ తేదీన అమెరికాలో భర్త మనోజ్ కు హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందాడు. అమెరికా నుండి 23న వచ్చిన భర్త మనోజ్ మృతదేహానికి బుధవారం వనస్థలిపురంలో అంత్యక్రియలు జరిగిన తర్వాత పుట్టింటికి వచ్చిన సాహితి ముభావంగానే ఉంటూగురువారం ఉదయం తోడుగా ఉన్న చెల్లెలు బయటకు వెళ్లిన పది నిమిషాల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.