Logo

అదానీ గ్రూపు కంపెనీలకు ఊహించని నష్టాలు

ముంబయి : అదానీ గ్రూపు కంపెనీలు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికన్‌ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బకు గౌతం అదానీ ఊహించని నష్టాలు చవి చూశారు.

స్టాక్‌ మార్కెట్లలో వరుస భారీ నష్టాలతో అదానీ టాప్‌ -10 కుబేరుల జాబితాలో చోటు కోల్పోయారు.

కేవలం మూడు రోజుల్లోనే లక్షల కోట్ల రూపాయల విలువను నష్టపోయారు.

దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానం నుంచి ఏకంగా 11వ స్థానానికి దిగజారారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ మంగళవారం ఓ రిపోర్టులో తెలిపింది.

2023 జనవరి మాసంలో 36 బిలియన్‌ డాలర్ల (రూ.2.94 లక్షల కోట్లు) వ్యక్తిగత సంపదను నష్టపోయారు.

ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద 84.4 బిలియన్‌ డాలర్ల (రూ.6.90 లక్షల కోట్లు)కు తగ్గిందని అని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. మూడు సెషన్లలో అదానీ గ్రూప్‌ సంస్థలు 25 శాతం మార్కెట్‌ విలువను కోల్పోయాయని వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking