ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి
గోల్నాక డివిజన్ లో హిందు వాహిని ఆధ్వర్యంలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అంబర్ పేట, సికింద్రాబాద్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
చత్రపతి శివాజీ వీరోచిత పోరాటం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తల్లి జిజియా భాయ్ ఆకాంక్షలతో దర్గామాత ఆశీస్సులతో ఎన్నో విజయాలు సాధించారన్నారు ఆయన. చత్రపతి శివాజీ దేశానికి ఆదర్శమైన పాలన అందించారన్నారు ఆయన. లక్షల మంది ఎదురువచ్చినా.. ఎవరెన్ని కుట్రలో చేసిన తన తెలివితేటలు, జ్ణానంతో పోరాటలు చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థిపించారని కొనియాడారు కిషన్ రెడ్డి.
మహారాష్ట్రలోని పాడైన శివాజీ కోటలను బాగు చేయాలని అక్కడి సీఎం షిండే కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్రలోని శివాజీ కోటలను పునరుద్ధరించడానికి నిధులు కేటాయించాలని మోడీ ఆదేశించారన్నారు ఆయన. శివాజీ స్ఫూర్తితోనే దేశంలోని హిందూ సమాజం ఏకమవుతోంది చైతన్యమవుతోందన్నారు కిషన్ రెడ్డి.
అయోధ్య రామ జన్మభూమిలో భవ్యమైన ఆలయ నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది ఆయోధ్య రామ మందిరాన్ని వెళ్లి దర్శించుకుందామన్నారు కిషన్ రెడ్డి. హిందూ వాహిని చిన్నగా ప్రారంభమై ఇప్పుడు అన్ని బస్తీలకు విస్తరించి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు ఆయన. హిందూ వాహిని అందరినీ ఏకం చేసి చత్రపతి శివాజీ జయంతి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి.