ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేదంటున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన శేరు పోశెట్టి,
ప్రభుత్వాలను, ప్రజా ప్రతినిధులను ప్రశ్నించడం మాత్రమే పౌర స్పృహ కలిగివున్నట్లు కాదంటున్నారు ఆయన. సమస్యలను గుర్తించినప్పుడు, వాటికి తక్షణ పరిష్కారం చూపడంలోనే అసలు సిసలైన పౌర స్పృహ ఉందంటున్నారు శేరు పోశెట్టి, ఇల్లుతో పాటు తాము నివసించే ప్రాంతాలలో కనిపించే మురికిని తొలగించినప్పుడే అసలైన దేశ భక్తిగా పేర్కొంటున్నాడు ఆయన.
74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో…