Logo

లోకల్‌ రైలు సర్వీసులు ఎందుకు రద్దు చేసినట్లు..?

హైద‌రాబాద్ : సికింద్రాబాద్‌, హైదరాబాద్ సబర్బ‌న్‌కు సంబంధించిన 19 ఎంఎంటీఎస్‌ లోకల్‌ రైలు సర్వీసులను ఈ నెల 28 నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేసినట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

ఆ తర్వాత తిరిగి యథావిధిగా నడుస్తాయన్నారు. పలు మ‌ర‌మ్మ‌తుల‌ కారణాల వల్ల 19 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.

ఇందులో లింగంపల్లి – హైదరాబాద్‌ మధ్య ఐదు సర్వీసులు, ఫలక్‌నుమా – లింగంపల్లి స్టేషన్ల మధ్య 11 సర్వీసులు రద్దు చేశారు.

అలాగే ఫలక్‌నుమా – హైదరాబాద్‌ మధ్య ఒకటి, రామచంద్రాపురం – ఫలక్‌నుమా స్టేషన్ల మధ్య రెండు చొప్పున లోకల్‌ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking