Logo

రాష్ట్రాన్ని మరోసారి విడగొడతామంటే తోలుతీస్తా

రాష్ట్రాన్ని మరోసారి విడగొడతామంటే తోలుతీస్తా

: జనసేన అధినేత  పవన్ కళ్యాణ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ను మరోసారి విడగొడతామంటే తోలుతీస్తానని  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించారు.

మంగళగిరిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని జగన్ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు.

వేర్పాటు వాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరన్నారు.

ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారన్నారు ఆయన.

ఏమయ్యా ధర్మాన.. నీకు మంత్రి ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రం కావాలా? ధర్మాన.. బైరెడ్డి ప్రత్యేక రాష్ట్రాలు అంటే సరిపోతుందా? రాయలసీమ అనే వాళ్లు ఎందుకు అక్కడ అభివృద్ధి చేయలేదు.  ఖ్యమంత్రులందరూ రాయలసీమ నుంచి వచ్చే కదా పాలించారు? అన్నారు పవన్ కళ్యాణ్.

ప్రధానిని కలిసి  సజ్జల, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తా. మంత్రి ఇల్లు తగులపెట్టించుకున్నా సీఎం వెళ్లలేదు. ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి వెళ్లలేదు. బాబాయిని చంపేసి కేసును సీబీఐకు ఇవ్వమనడం ఏమిటి?.’’ అని పవన్ ప్రశ్నించారు.

‘‘ప్రజల కోసమే జనసేన కార్యాలయం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా జనసేన ఆఫీస్‌కు రావచ్చు. వారాహిని రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. అడ్డుకుంటాం, అనుమతివ్వం అని మాట్లాడారు.  చట్ట ప్రకారం వారాహికి అన్ని అనుమతులు తీసుకున్నా.నేను కోడి కత్తితో పొడిపించుకుని రాలేదన్నారు పవన్ కళ్యాణ్.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో సహా వేల కోట్లు కాజేశారు. దోచుకున్న మీరే ఇలా ఉంటే.. నిజాయితీగా ఉన్న మాకెంత ఉండాలి?. ప్రజల కోసం త్వరలోనే వారాహి యాత్ర చేపడతా.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking