తాహశీల్దార్ కార్యాలయం ముందు
పెట్రోల్ సీసాతో అందోళన
యాదాద్రి : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ఎమ్మార్వో ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిల్ తో దాతర్ పల్లి గ్రామానికి చెందిన రైతు మేకల భిక్షపతి కుటుంబ లతో ఆందోళన చేశారు. తమ భూమిని అక్రమంగా కొందరు వ్యక్తులు ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఆరోపిస్తూ పెట్రోల్ బాటిల్ తో ఆందోళన చేపట్టారు.
తమకు న్యాయం చేసే వరకు ఎమ్మార్వో ఆఫీస్ ముందు నుండి కదిలేది లేదని పెట్రోల్ బాటిల్ తో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రెవెన్యూ అధికారి కోర్టు ఆర్డర్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. కోర్టు నుండి మరోసారి ఆర్డర్ వస్తే నిలిపివేస్తామని తెలిపారు. ఆందోళనకు దిగిన రైతు కుటుంబానికి చట్ట ప్రకారం వెళ్లాలని సూచించి పంపించారు…