Logo

అబ్దుల్ రజాహుస్సేన్ రచనలు – పొలమారిన జ్ఞాపకాలు

‘వంశీ’…..” పొలమారిన జ్ఞాపకాలు ” 3.

ఏదీ? నీ… స ‘ మ్మోహనం” ?

చిత్రమోహనుడు
చితిగా మిగిలె నేడు
పంచ భూతాల
పంచనజేరి…
మోహనరాగ
మాలపించు
వర్ణములన్నీ ఒక్కటై
బూడిద వర్ణముతోడ
మోహనాకారుడై
వెలిగెను నేడు !!

ఎ.రజాహుస్సేన్.!!

*చిత్రకారుడు,క్యారికేచరిస్ట్,కార్టూనిస్ట్, రచ
యిత “మోహన్ అంతిమ యాత్ర “…!!

మోహన్ ఇప్పుడు లేరు.. తెలుగు కార్టూన్ కు, ఆయన ఓ ఆకుపచ్చని జ్ఞాపకం.ఒక్క కార్టూన్
కు ఏమిటండీ.?చాలా మందికి ఆయన ఓ…
మరిచిపోలేని జ్ఞాపకం.వారిలో ‘వంశీ’ కూడా
ఒకరు. అందుకే వంశీ ” పొలమారిన జ్ఞాపకాల్లో ” మోహన్ అంతిమ యాత్ర ” చోటుచేసుకుంది.
మోహన్ గురించి తెలీనివారెవరుంటారు?
అయినా కూడా ఆయన గురించి నాలుగు….
పరిచయ వాక్యాలు చెప్పడం నా ధర్మం.

‘మోహన్.’ తెలుగు కార్టూన్ కు కొత్త చిరునామా
క్యారికేచర్ కు ప్రతిరూపం. నవ్య చిత్రాలకు చిరు
నామా‌.‌తెలుగు కార్టూన్లను మోహన్ కు ముందు
మోహన్ కు తర్వాత అని వేరుచేసి చూడదగ్గ ‘కార్టూనిజమ్’ మోహన్ సొంతం.అలాగే బొమ్మల
కు కొత్త గీతలతో రంగులద్దాడు !!

కార్టూనిస్టుగా అందరికీ తెలిసిన మోహన్ కథల
కి ఇలస్త్రేషన్లు,కవిత్వాలకి బొమ్మలూ,నవలలకి కవర్పేజీలు,వామపక్ష, విప్లవ పోస్టర్లు,సభలకి
బ్యాక్ డ్రాప్ లూ, మహిళ,దళిత, బడుగు బల
హీన,అస్తిత్వ ఉద్యమ పోస్టర్లూ, ప్రముఖుల
పోర్ట్రేయిట్లు, కేరికేచర్లు, పార్టీల ఎన్నికల కాంపె
యిన్బొమ్మలు, ఇంకా కేలండర్లూ, బ్రోచర్లూ, ఫోల్డ
ర్లు,లోగోలు, కరపత్రాలూ వేలల్లో వేశాడు.ఇన్ని పనులు చేస్తూనే నలభైయేళ్లపాటు సీరియస్ రాజకీయ వ్యాసాలు, ఇంటర్వ్యూలు,పొట్టచెక్క
లయ్యే పూర్తి వెటకారపు పుల్లవిరుపు విమర్శ
లూ,ప్రపంచ ప్రసిద్ధ కార్టూనిస్టుల పరిచయాలూ,
పెయింటర్ల, ఆర్టిస్టుల జీవితాలపై ఆర్టికల్స్ చాలా
నే రాశాడు…!

బాపూ, చిత్తప్రసాద్ ల నుంచి ఎన్టీ రామారావు, కెసియార్దాకా, కేతే కోల్విజ్ నుంచి మణిశంకర్ అయ్యర్, దాసరి నారాయణరావు దాకా, పరిగెత్తించే పరిమళభరితమైన వచనంతో మంచిగంధం లాంటి వ్యాసాలు కొన్ని వందలు రాశాడు. వాటిలో ఒక 46 వ్యాసాలతో ‘కార్టూన్ కబుర్లు’ అనే పుస్తకాన్ని 1996 సెప్టెంబర్ లో తెచ్చాడు. మోహన్ ఏకైక పుస్తకం ఇది . తీవ్ర విప్లవ,దళిత, ఆదివాసీ, బాలగోపాల్ పుస్తకాల
తో ప్రసిద్ధి చెందిన పెర్స్పెక్టివ్స్ R.K(రామకృష్ణా
రావు గారు) ఈ పుస్తకాన్ని ముద్రించారు.

1996 నవంబర్ లోనో, డిసెంబర్ లోనో కార్టూన్ కబుర్లు ఆవిష్కరణ సభ హైదరాబాద్ సుందర
య్య విజ్ఞాన్ భవన్ లో గొప్పగా జరిగింది.
మణిశంకర్ అయ్యర్, సురవరం సుధాకర్ రెడ్డి, దాసరి నారాయయణరావు, వరవరరావు, హాస్యనటులు బ్రహ్మానందం,తనికెళ్ళ భరణి, గాయకుడు గద్దర్,వేణు మాధవ్, మరికొందరు ప్రముఖులు వచ్చారు.

ఈ పుస్తకం ‘కార్టూన్ కబుర్లు’ విస్తృతంగా జనం దగ్గరకు చేరలేదు..కానీ…ఆ చదివిన కొద్దిమంది
నీ బాగాప్రభావితంచేసింది. కేవలం కార్టూన్ కబు
ర్లు చదివి, వచ్చి,మోహన్ ను చూసి,మాట్లాడిన వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు.

కార్టూన్ కబుర్ల గురించి పుస్తకం వెనుక అట్ట
మీద మీద మోహన్ ఇలారాశారు….“ సక్సెస్, హోదా, పేరూ, డబ్బూ, సుఖం కోసం…మీరు చేస్తున్న గొప్ప కృషికి ఏమాత్రం పనికిరాని
సొల్లు కబుర్లివి.పైగా ఆ ప్రస్థానంలో మీ కాళ్లకు అడ్డం పడే పరమ గాసిప్ గ్రంథమిది. ఆపై మీ ఇష్టం”‌‌ !!.

మోహన్ మొహమాటానికి అన్నా, కార్టూన్లకు
ఈ పుస్తకంకొత్తసిలబస్ అని గట్టిగా చెప్పొచ్చు.!!

 కన్నుమూత..!!

సెప్టెంబర్ 7 నుంచి ఆయన అనారోగ్యంతో బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. గురువారం సెప్టెంబర్ 21 ఉదయం మోహన్ మృతిచెందారు.

సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన అనేక కార్టూన్లు వేశారు. 1951 డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన మోహన్.. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఉదయం తది
తర దినపత్రికల్లో దశాబ్దాల పాటు కార్టూనిస్టుగా పని చేశారు..’మాజిక్ లాంప్ పబ్లిక్ లిమిటెడ్’ పేరుతో యానిమేషన్ స్టూడియోను స్థాపించి
యానిమేషన్ చిత్రాలను కూడా రూపొందించారు.

మోహన్…ఓ పొలమారిన జ్ఞాపకం.!!

ఇప్పుడు వంశీ పొలమారిన జ్ఞాపకం లోకి వెళ్ళి
మోహన్ అంతిమ యాత్ర” విషాదాన్ని పరికిద్దాం.!

“ఆరోజు ….

మోహన్ చనిపోయేరు.

శవాన్ని పద్మాలయా డౌన్లో వున్న స్మశానం… ‘మహాప్రస్థానం” కు తీసుకొస్తుంటే చాలా
మంది ఆఖరుసారి మోహన్ ను చూడ్డానికొచ్చేరు.

ఆ జనం మధ్యలో మోహన్ శవాన్ని ఎలక్ట్రిక్ క్రిమేటర్లోకి తీసుకెళ్తుంటే మోషేదయాన్ ఫ్లూటు వాయిస్తున్నాడు.చుట్టూ మూగిన జనం నీరాజ
నం పలుకుతున్నారు.కొందరు ఏడుస్తున్నారు.

మోహన్ పార్థివ దేహం నెమ్మదిగా ఎలక్ట్రిక్
క్రిమేటర్లోకి వెళ్తోంది.

మోషే ఫ్లూటు రకరకాల విషాదాంతాల్లోకెళ్ళి మెలికలుతిరిగి మోగుతా వుంది.వింటున్న
వాళ్ళ ❤️ గుండెల్నిమెలి పెడుతూ వుంది.
మోహన్ గారి పార్థివ దేహం ఆక్రిమేటర్లోకి
పూర్తిగా వెళ్ళోపోయిన కాస్సేపటికి కాలి
పోయి.వెదురు చేటంత బూడిదయ్యింది.

మోషే ఫ్లూటు ఆగిపోయింది.

ఏడుస్తున్న జనం ముఖాల్లో నిశ్శబ్దం..

ఆ మహా ప్రస్థానమంతా ప్రేమ నిశ్శబ్దం..

మోహన్ ఇక లేడు. అంతెత్తున మనిషి
కూడా కాలి చేటంత బూడిదయ్యాడు..!!

*మృత్యోర్మా….!!

మామూలప్పుడు చాలా సైలెంట్ గా వుండే మోహన్ గారుతాగితే మటుకు చాలా ఎక్కువ తాగుతాడు.ఆయనకు గురుదత్త ప్యాసా అన్నా, సైగల్ పాటలన్నా చాలా ఇష్టం అనే కంటే ప్రాణం అనడం న్యాయంగా ఉంటుంది..!

ఆమధ్యనే గికోర్ సినిమాలో ఫ్లూటు‌ బిట్టంటే చెవి
కోసుకునేవాడు.ఫ్లూటు వాద్యకారుడు మోషేను అడిగి మరీ ఈ గికోర్ ఫ్లూటు బిట్టును వాయించు
కొని మరీ వినేవాడు.తాగుతున్నప్పుడైతే…మోషే వాయిస్తుంటే..ఇక ఏడుపే..ఏడుపు.

తాగుడు ఎక్కువైపోవడంవల్ల మోహన్ ఆరోగ్యం బాగాపాడైపోయింది.మోషే వెళ్ళి అడిగితే,

” ఏం లేదబ్బా !

చిన్న ప్రాబ్లం.తగ్గిపోద్దిలే’ అంటూ నవ్వేసేవాడు.

ఆవేళచెకప్ అయింది..లివర్ బాగా పాడైపో
యింది.సిరోసిస్..సర్జరీ చేయాలి…అడ్మిట్ చేయండన్నారు డాక్టర్లు.సర్జరీ అప్పుడు…
‘ఎ‌ ‘ పాజిటివ్ బ్లడ్ కావాల్సివస్తే లక్కీగా ఉషది
అదే గ్రూప్ బ్లడ్ కావడం.. ఫేస్బుక్ ఫ్రండ్ హరీష్
ది కూడాఅదే గ్రూప్ బ్లడ్ కావడంతో సమస్య తీరిపోయింది..వాళ్ళిద్దరూ ఆవేళ బ్లడ్ ఇచ్చారు.

స్నానం చేసి,చక్కని బట్టలేసుకొని,చెదిరిన జుట్టు
ని చక్కగా దువ్వుకొని సర్జరీకి వెళ్ళిన మోహన్ ను..ఆపరేషనయ్యాక. స్ట్రెచర్ మీద తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు.

మెలుకువ వచ్చిన మోహన్ మోషేను చూస్తూ..
నీరసంగా మెడ తిప్పుతూ..పీలగా నవ్వుతూ..
ఫ్లూటు వాయించబ్బా! అంటే…మోషే వాయించ
డం మొదలుపెట్టాడు…!

తాగినప్పుడు మాత్రమే ఆ ఫ్లూటు బిట్టు వింటా ఏడ్చేమోహన్ గారు..ఆ వేళ ఆ తాగని టైంలో కూడా ఏడ్వడంతో చూసినవాళ్లు కళ్ళు చెమ్మ
గిల్లాయి.!!

ఏమిటా! ఫ్లూటు బిట్టు…?

గికోర్ సినిమాలో ట్రిగాన్ మన్యూరియన్ నేపథ్య సంగీతంకంపోజ్ చేశాడు.రొమేనియన్ దేశపు ప్రాచీన వాయిద్యాలను కంపోజింగ్ లో వాడాడు.
అన్నింటికంటే ముఖ్యంగాఒక ఫ్లూట్ బిట్ మనల్ని వెంటాడతా..వేధిస్తా వుంటుంది.మోహన్ కు ఈ ఫ్లూట్ బిట్ అంటే ఆరో ప్రాణం.

ఎవరీ మోషేదయాన్…?

పెయింటింగ్స్ వేసి ఆర్ట్ గేలరీల్లో ఎగ్జిబిషన్ లు కండక్ట్చేస్తాడు.ఆరనకుఫ్లూట్ వాయించడం హాబీ.మిడిల్ …ఫ్లూట్ గాకుండా,బేస్ ఫ్లూటూ,
ఇంకా అన్ని ఆక్టేవ్స్ లోఫ్లూట్ లు వున్నాయంట.

మోషే తో వంశీ పరిచయం..!!

వంశీ గారు శుభోదయం చెబుతూ..ఓ చక్కని ఫోటో(ఆయన తీసినవే) పెట్టడం అలవాటు.
ఓరోజు మోషేఫోన్ చేసి,” మీరు శుభోదయంలో పెట్టిన ఫోటోల్లో ఒకదాన్ని నేను పెయింటింగ్ గా వేసుకోవచ్చా అని వంశీకి ఫోన్ చేశాడు..

దానికేముంది..భేషుగ్గా వేసుకోమన్నారు వంశీ.

ఆ పొద్దుటే..చిన్న కాఫీ హోటల్ చూరులో టీ కొండ్తు
న్న ఓ ముసలోడి పెయింటింగ్ ను వంశీకి పంపేడు మోషే.ఆ ఫోటోలో వున్న సోర్స్ ఆఫ్ లైట్ ను మోషే వాడుకున్నతీరుకు వంశీ అబ్బురపడ్డాడు. ఓరోజు మోషే,ఆయన భార్య ఉష ఇంటికి వెళ్ళి…వంశీని కలిశారు.ఆతర్వాతమోహన్ గారితో పరిచయం.
కలిసి గికోర్ సినిమా చూడ్డం జరిగిపోయాయి. మోహన్ గారు మోషేను గికోర్ లోని ఫ్లూట్ బిట్ వాయించమనడం….మోషే వాయించడం..
తరచూ జరిగేది..

*మోహన్ తో వంశీ పరిచయం..!!

ఓ సారి ఆర్టిస్ట్ చంద్ర దగ్గర మోహన్ ప్రసక్తి వచ్చిం
ది.కొంగర జగ్గయ్య గారి వద్ద వంశీ గారు మొట్ట
మొదటమోహన్ చూశారు.ఆత్రేయ మనస్విని అవార్డు మెడల్తాలూకు డిజైన్ ను మోహన్ చేతి గీయించారు జగ్గయ్య.అప్పుడు వంశీకి,మోహన్ కు దోస్తానా కుదిరింది.ఆతర్వాతో తెలుగు లలిత కళా తోరణం లో బాపుగారి కి లైఫ్ ఎచీవ్ మెంట్ అవా
ర్డు ఇచ్చే సందర్భంలో కూడా వంశీ, మోహన్ కలుసుకున్నారు.అలా వారిద్దరి మధ్య స్నేహం
కదిరి,ముదిరి..ఇలా పొలమారిన జ్ఞాపకాల్లోకొచ్చి
చేరింది…!!

ఎ.రజాహుస్సేన్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking