Logo

జీ20 స‌ద‌స్సులో ప్రపంచ తెలుగు ఐటీ కౌన్సిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

జీ20 స‌ద‌స్సులో ప్రపంచ తెలుగు ఐటీ కౌన్సిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌
– సింగపూర్ లో జరిగే ప్ర‌పంచ తెలుగు ఐటీ స‌ద‌స్సు టీజ‌ర్ సైతం విడుద‌ల‌
– ఏఐ క‌మాండ్ ద్వారా వినూత్న రీతిలో ఆవిష్క‌రించిన సందీప్ మ‌ఖ్త‌ల‌
– సందీప్ మ‌ఖ్త‌ల‌ను అడ్‌హ‌క్ క‌మిటీ చైర్మ‌న్‌గా నియ‌మించిన బృందం

హైద‌రాబాద్/ విశాఖ‌ప‌ట్ట‌ణం, ఫిబ్ర‌వ‌రి 18, : భార‌త‌దేశంలో జ‌ర‌గ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క జీ20 స‌ద‌స్సు భాగంగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన జీ20 గ్లోబ‌ల్ టెక్ స‌మిట్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ లోగో ఆవిష్క‌రించారు. దీంతోపాటుగా వ‌చ్చే మే నెల‌లో సింగ‌పూర్‌లో జ‌ర‌గ‌బోయే ప్ర‌పంచ తెలుగు ఐటీ స‌ద‌స్సు టీజ‌ర్ సైతం విడుద‌ల చేశారు. ఏఐ వాయిస్ క‌మాండ్ ద్వారా వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కాన్ఫ‌రెన్స్ టీజ‌ర్‌ను సందీప్ మ‌ఖ్త‌ల ఆవిష్క‌రించారు. ఇదే కార్య‌క్ర‌మంలో ప్ర‌పంచ తెలుగు ఐటీ కౌన్సిల్ అడ్ హ‌క్ క‌మిటీ చైర్మ‌న్‌గా సందీప్ కుమార్ మ‌ఖ్త‌ల‌ను క‌మిటీ ఎన్నుకుంది. కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారుగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మరియు ఐటీ ఏజెన్సీ (అపీటా) గ్రూప్ సీఈఓ కిరణ్ సలికి రెడ్డిని ఎన్నుకున్నారు.

ప్ర‌పంచంలో ఉండే తెలుగు టెకీల‌ను ఒక‌తాటిపైకి తెచ్చి జీ20 కార్య‌క్ర‌మాల వేదిక‌గా త‌మ స‌త్తా చాటేందుకు వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ ఏర్ప‌డింది. రెండు తెలుగు రాష్ట్రాల‌కు పెట్టుబ‌డులు తెచ్చేందుకు ఏర్పడిన ఈ కౌన్సిల్ తాజాగా విశాఖ‌లో జ‌రిగిన జీ20 గ్లోబ‌ల్ టెక్ స‌మ్మిట్‌లో ఈ మేర‌కు నూత‌న కమిటీని నిర్ణ‌యించారు. ఈ సంద‌ర్భంగా అడ్‌హాక్ క‌మిటీ ఏర్పాటు చేసి, చైర్మ‌న్‌గా టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌లను నామినేట్ చేశారు. ప‌ది సంవ‌త్స‌రాల‌కు పైగా తెలంగాణ ఐటీ అసోసియేష‌న్ నిర్వ‌హించ‌డంతో పాటుగా, తెలంగాణ‌కు పెట్టుబ‌డులు తేవ‌డం, ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషించిన తీరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ మేర‌కు నామినేట్ చేశారు. ప్ర‌పంచంలోని టెక్కీలలో తెలుగువారు ఎక్కువ‌గా ఉండ‌గా, వారిని వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్‌లో భాగ‌స్వామ్యం చేసేందుకు క్రియాశీలంగా కృషి చేయ‌నున్న‌ట్లు సందీప్ మ‌ఖ్త‌ల ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

ప్ర‌పంచవ్యాప్తంగా భారత దేశంతోపాటు వివిధ దేశాల్లో ఉన్న ఐటీ పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేట‌ర్లు, పరిశోధ‌కులుగా సేవలు అందించ‌డం, కీల‌క ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న తెలుగు ఐటీ రంగ నిపుణుల‌ను ఒక‌తాటిపైకి తీసుకువ‌చ్చేందుకు మొట్టమొదటి వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కాన్ఫ‌రెన్స్ (WTITC)ను ప్ర‌పంచ తెలుగు ఐటీ కౌన్సిల్ రెండు తెలుగు రాష్ట ప్రభుత్వాల సహకారంతో తెలంగాణ‌ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా)తో క‌లిసి నిర్వ‌హిస్తోంది. సింగ‌పూర్ వేదిక‌గా మే 6, 7 తేదీల్లో జ‌రగ‌నున్న కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌ధానంగా టెక్నాల‌జీ ఎక్సేంజ్ జ‌రుగనుంది. జీ20 స‌ద‌స్సుకు వివిధ దేశాల నుంచి వ‌చ్చిన తెలుగు పారిశ్రామిక‌వేత్త‌లు వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్‌లో స‌భ్య‌త్వం పొందేందుకు ముందుకు వచ్చారు. వ‌ర‌ల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్‌లో స‌భ్య‌త్వం కోసం wtitc.org లింక్ ద్వారా లేదా 8123123434 ఫోన్ నంబ‌రును సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఈ కార్యక్రమంలో సీవీ అశ్విన్, సైమాక్స్ అధినేత శంకర్, రిట్జ్ సీఈఓ ఎంఎన్ఆర్ గుప్త, అఖిలేష్ కండ్రే, వెబ్ సాక్ సీఈఓ అశోక్, అస్పెక్టో అధినేత సుజిత్, ప్రిజం మల్టీమీడియా సీఈఓ శ్రీనివాస్ గౌడ్, అల్కాయోన్ సీఈఓ ఆనంద్ విశ్వనాథ, ఎస్ఎస్ఆర్ సీఈఓ సుధీర్, రోబొకలాం సీఈఓ సాజీద్, చైతన్య, ఏర్లో సీఈఓ క్రాంతి, రాజ్, క్లౌడ్ ఫాక్ట్ సీఈఓ వెంకట కిరణ్ ఉమ్మడి, జెనిఫై సీఈఓ శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking