Logo

ప్రజలను మోసం చేయడంలో ఘనులు వై.సీ.పీ. నాయకులు

పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు దగ్గర

కార్యకర్తగా పని చేయడం గర్వంగా ఉంది

– పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు

సీఎం జగన్ అప్పుడేమో అబద్ధపు హామీలు, అసత్య ప్రచారలతో అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడేమో పరిపాలన చేత కాక ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. ప్రజల దృష్టి మరల్చడానికి పనికిమాలిన మాటలతో ప్రజలను మోసం చేస్తున్నరన్నారు పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు.

అనంతపూర్ జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో నాగబాబు మాట్లాడారు. జగన్ రెడ్డి గారి నటనకు ఆకర్షితులైన ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే అదే నటనతో ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు.

ప్రజా ప్రయోజనాల కోసం పని చేయాల్సిన ప్రభుత్వం, మంత్రులు వ్యక్తిగత స్వలాభాల కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడు దగ్గర కార్యకర్తగా పని చేయడం గర్వంగా ఉన్నదని, ప్రజలంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.

అనంతపురం జిల్లాలోని వీర మహిళలు, జన సైనికుల మీద వై.సీ.పీ. నాయకులు దాడులకు తెగబడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అకారణంగా బెదిరింపులకు, దాడులకు తెగ బడే వారిని ప్రతిఘటించాలని అన్నారు.

పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కందుల దుర్గేశ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూధన్ రెడ్డి గారు, అధికార ప్రతినిధి శ్రీ కూసంపూడి శ్రీనివాస్ గారు, శ్రీమతి రాయపాటి అరుణ గారు, శ్రీమతి కీర్తన గారు, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, బాబురావు, జయ రామిరెడ్డి, ఈశ్వరయ్య, మంజునాథ్ గౌడ్, పవన్, శ్రీకాంత్ రెడ్డి, ఉమేష్, భైరవ ప్రసాద్, చంద్ర శేఖర్, నాగేంద్ర, అబ్దుల్లా, బెస్త సీనా, శ్రీదేవి, రాధిక తదితరులు పాల్గొన్నారు.

అనంతపురంలో శ్రీ నాగబాబు గారికి అశేష జన స్వాగతం..

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారికి అనంతపురంలో అశేష జన స్వాగతం లభించింది. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన శ్రీ నాగబాబు గారికి జిల్లా సరిహద్దు నుంచే జన సైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా బాణసంచా, హారతులు, గజమాలలతో అనంతపురం కార్యకర్తలు ఆహ్వానం పలికారు.

జనసేన వీర మహిళా కార్యాలయం సందర్శించిన శ్రీ నాగబాబు గారు..

అనంతపురం పర్యటనలో భాగంగా శ్రీ నాగబాబు గారు ఆదివారం అనంతపురంలోని జనసేన పార్టీ వీర మహిళా కార్యాలయం సందర్శించారు. కార్యాలయంలో మహిళా సాధికారత కోసం చేపడుతున్న శిక్షణ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking